9000 years of oldest temple kakinada in telugu

LIFE IS SCIENCE
0

9000 years ancient temple in kakinada in telugu

తిరుమల తిరుపతి అనగానే మనఅందరికి ఎప్పుడు చిత్తూరు జిల్లాలో శ్రీవేంకటేశ్వరుడు వెలసిన తిరుపతి దేవస్థానం మాత్రమే గుర్తుకు వస్తుంది కానీ స్వామి విష్ణు మూర్తి తాను స్వయంభువుగా మొట్టమొదటిగా వెలిసిన క్షేత్రం మన తెలుగు రాష్ట్రాలలో ఒక్కటి ఉంది అది సింహాచలం కన్నా 8000వేల సంవత్సరాలు మన తిరుమల తిరుపతి కన్నా 6000వేల సంవత్సరాలు చాల వైష్ణవ దేవాలయాల కన్నా పురాతనమైనది ఈ దేవాలయం. స్వామి స్వయంభువుగా ఇక్కడ వెలిసి 9000వేల సంవత్సరాలు గడిచింది. 

అయితే ఆవిషయాలు అన్ని పూర్తిగా తెలుసుకోబోయే ముందు మన ఈ బ్లాగ్ గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను ఈ బ్లాగ్ పేరు హిందువుల భక్తి సమాచారం ఈ బ్లాగ్ లో భక్తికి సంబందించిన చాల విషయాలు మీకు దొరుకుతాయి మీరు ఈ బ్లాగ్ కి రావాలంటే గూగుల్ కి వచ్చి 
  ఇంగ్లీష్ లో hbs0.blogspot.com అని టైపు చేసి చూడచ్చు 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ దేవాలయం కాకినాడ జిల్లాలో ఉన్న తొలితిరుపతి స్వామివారు ఇక్కడ శృంగారవల్లభునిగా దర్శనమిస్తారు 

ఆలయ చరిత్ర :

విష్ణు మూర్తి మొదట శిలా రూపంలో స్వయంగా ఇక్కడే వెలిసినందుకు ఈ తిరుపతిని తొలితిరుపతి అంటారు స్వామి స్వయంభువుగా వెలాసిన ప్రతి చోట ఆళ్వారులు ఉంటారు అలాగే ఇక్కడ గర్భాలయంలో స్వామివారికి ఎడమవైపు ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయ్. 
స్వామివారు వెలిసిన ఈ ప్రాంతం ఆ కాలంలో  కీకారణ్యాలతోటి ఉండేది. మనం పురాణాల్లో విన్న ధ్రువుని కథయే స్వామివారు ఇక్కడ వెలియడానికి కారణం అయ్యింది . 

ధ్రువుని సవతితల్లి అయినా సురుచి ధ్రువునికి సింహాసనం దక్కకుండా చేయడం కోసం కుతంత్రాలు చేస్తున్న సందర్భంలో ధ్రువుని తల్లి సునీతి దృవుడుని పిలిచి నువ్వు సింహాసనం అధిరోహించి రాజ్యపాలన చేయాలి అంటే శ్రీమహావిష్ణువుని తపస్సు చేసి ప్రసన్నం చేసుకోవాలని చెప్పిందంట. అప్పుడు వెంటనే ధ్రువుడు ఈ కీకారణ్యం చేరుకున్నాడట. అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందంట అప్పుడు ధ్రువుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీమహావిష్ణువు యొక్క తపస్సు విధానం అడుగగా. అప్పుడు శాండిల్య మహాముని నాయన విష్ణుమూర్తి దివ్యమంగళ స్వరూపాన్ని తలచుకుంటూ తపస్సు చేయి స్వామి ప్రత్యక్షమై నీకోరిక నెరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావలసిన ఏర్పాటు చేసాడట. అలా శాండిల్య మహాముని చెప్పినట్టు ధ్రువుడు భక్తి శ్రద్దలతో తపస్సు చేయడంతో ఆమహాముని చెప్పినట్లే దివ్యమంగళ కాంతులతో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగా స్వామి తేజస్సు చూసి ధ్రువుడు బయపడ్డాడట అది చూసిన విష్ణుమూర్తి నాయన ఎందుకు బయపడుతున్నావు నేను నీఅంతే కదా ఉన్నాను అని నవ్వుతూ తల నిమిరి ధ్రువుని భయాన్ని పోగొట్టి ధ్రువునికి దర్శనమిచ్చిన చోటే స్వామి శిలా రూపంలో వెలిశాడట. ఆ అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసిన దేవతలు స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారంట. ఆ తరువాత నారదముని లక్ష్మి అమ్మవారిని. మరి కొన్ని సంత్సరాల తరువాత శ్రీకృష్ణ దేవరాయలు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. 

ఆలయ విశిష్టతలు  :

  • ఇక్కడ స్వామివారు ఎవరి ఎత్తులో వారికీ దర్శనమిస్తారు అంటే నాలుగు అడుగుల వ్యక్తి చూస్తే నాలుగడుగుల ఎత్తులోను అలాగే ఆరడుగుల వ్యక్తిచూస్తే అరడుగులగాను దర్శనమిస్తారు అన్న మాట దీనికి కారణం స్వామి దృవుడుకి దర్శనమిచ్చినప్పుడు బయపడకు నేను నీయఅంతే కదా ఉన్నాను అని ధ్రువుడికి చెప్పడమే 
  • చిద్విలాస వేంకటేశ్వరుడు అంటే స్వామి నవుతున్నట్టుగా దర్శనమిస్తారు 
  • స్వామి తిరుమల తిరుపతి వేంకటేశ్వరునితో పోల్చిచూస్తే అయన శంఖ చక్రాలు స్థానం మారి ఉంటాయి 
  • ఆలయ ప్రాంగణంలోనే శివాలయం వైష్ణవాలయం రెండూ ఉన్నాయ్ 
  • ఎవరైతే సంతానం లేక బాధపడుతారో వారు ఆలయం వద్ద నూతిలో స్థానం చేస్తే వారికీ సంతాన ప్రాప్తి కలుగుతుంది 
  • ఏక శిలా కళాకండాలు విష్ణుమూర్తి యొక్క ఉత్సవమూర్తి ప్రధాన ఆకర్షణ 

  • కార్యక్రమాలు - పూజా విధానం

  1. నిత్యం దూప-దీప నైవేద్యం 
  2. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు దర్శనం 
  3. చైత్రశుద్ద ఏకాదశి  రోజు స్వామివారి కళ్యాణం కనులపండుగగా జరుగుతుంది అంటే శ్రీరామనవమి తరువాత మొదటి ఏకాదశిరోజు ప్రారంభించి 6రోజులపాటు ఉత్సవాలు జరుపుతారు 
  4. ధనుర్మాసంలో నెలరోజులపాటు పూజా కార్యక్రమములు జరుగుతాయి 

చరిత్రలో స్వామివారి దర్శించుకున్న ప్రముఖులు :

  1. భోజమహరాజు 
  2. బట్టి విక్రమార్క 
  3. రాణి రుద్రమదేవి 
  4. శ్రీకృష్ణ దేవరాయలు 
  5. పెద్దాపురం పిఠాపురం సంస్థాన మహారాజులు 
  6. లక్ష్మి నరసాపురం రాజులు 
లక్ష్మి నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాలు కేటాయించినట్లు చెబుతారు అయితే ఇప్పుడు ఆలయం పేరిట 21 ఎకరాలు ఉన్నట్టు చెబుతారు అయితే ఈ ఆలయం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది  

ఈ చోటుకి ఎలా వెళ్ళాలి :
స్వామివారి సన్నిధి సామర్లకోటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సామర్లకోట నుంచి ప్రత్తిపాడుకి వెళ్లే దారిలో దివిలి వస్తుంది అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. పెద్దాపురం నుంచి కూడా ఆటో సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి దివిలికి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ మీదుగా వచ్చే  బస్సులు సామర్లకోట మీదుగా వస్తాయి . 

కాకినాడ, ప్రత్తిపాడు, పెద్దిపాలెం, శాంతి ఆశ్రమం బస్సులు దివిలి లో ఆగుతాయి. కాకినాడ నుంచి తామరాడ వెళ్లే బస్సులు తొలితిరుపతిలో ఆగుతాయి . తొలితిరుపతిని చెదలాడ అనికూడా పిలుస్తారు 

 దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ : సామర్లకోట 
దగ్గరలో ఉన్న బస్టేషన్ : దివిలి 
పెద్దాపురం మండలం కాకినాడ జిల్లా  ఆంధ్రప్రదేశ్  


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)