అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైనా పురుహూతికా అమ్మవారు ||ancient puruhuthika temple pithapuram

anamakudu
0

అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైనా పురుహూతికా అమ్మవారు|| puruhuthika devi shakthi peetam pithapuram

 పురుహూతికా అమ్మవారి శక్తి పీఠం : 

హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి అష్టాదశ శక్తిపీఠాల గురించి తెలియనివాళ్ళు చాల తక్కువమంది ఉంటారు అసలు మనం ఈ పిఠాపురంలో వెలిసిన పురుహూతికా అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకోబోయేముందు అసలు శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనే కథని తెలుసుకుందాం 

మనం ఈ శక్తిపీఠాల గురించి తెలుసుకోవాలి అంటే పురాణకాలానికి వెళ్ళాలి. పురాణకాలంలో దక్షుడు అనే ఒకరాజు అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారు తన బిడ్డగా పుట్టే వరం ఇవ్వమని అడుగుతాడు అప్పుడు అమ్మవారు అలాగే పుడతాను అని చెప్పి తాను పుట్టిన తరువాత శివుని శక్తి కాబట్టి వివాహం శివునితోనే జరిపించాలి అని చెబుతుంది దానికి దక్షుడు కూడా ఒప్పుకుంటాడు.కానీ అమ్మవారు పుట్టిపెరిగిన తరువాత దక్షుడికి అమ్మవారు తన కూతురు అనే అహంకారం పెరిగి తన రాజు కూతురిని ఒకబైరాగికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేక ఒకరోజు అమ్మవారికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి శివునికి ఆహ్వానం ఉండదు అది గమనించిన అమ్మవారు బాధతో స్వయంవరం తరువాత వరుడి మేడలో వేయాల్సిన దండని క్రింద జారవిడుస్తారు అప్పుడు వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై క్రింద పడిపోతున్న ఆదండని తలవంచి తనను మెడలో పడేలాచేస్తాడు అప్పటినుంచి దక్షుడు శివుడు అమ్మవారి మీద కోపం పెంచుకుంటాడు.
ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానానికి  శివుడిని తప్ప సమస్త దేవతలని  పిలుస్తాడు అప్పుడు అమ్మవారు పరమశివుడిని అడిగి తన తండ్రి తలపెట్టిన యజ్ఞానానికి వెళుతుంది కానీ ఆ యజ్ఞంలో దక్షుడు శివుడిని అమ్మవారిని అందరి దేవతల ముందు  అవమానించడంతో అమ్మవారు అక్కడే నిప్పురగిలించి  తనను తాను ఆహుతి చేసుకుంటుంది ఇది తెలుసుకున్న పరమశివుడు వెంటనే దక్షయజ్ఞం దగ్గరికి చేరుకొని యజ్ఞం మొత్తాన్ని నాశనం చేస్తాడు ఇది జరిగిన తరువాత అమ్మవారి శరీరాన్ని తన భుజాలపై వేసుకుని శివతాండవం చేస్తాడు ఆ తాండవం వదలకుండా చేస్తూనే ఉండేసరికి మూడులోకాలు అల్లకల్లోలంగా అయ్యిపోతాయి అప్పుడు దేవతలందరు విషుణువు దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పాగా విష్ణుమూర్తి వెళ్లి పరమశివుని భుజాలమీద ఉన్న అమ్మవారి దివ్య శరీరాన్ని తన సుదర్శన చక్రంతో స్వామి భుజాలమీద ఉండగానే ముక్కలుగా చేస్తాడు అల భూలోకంలో అమ్మవారి శరీరభాగాలు పడిన ప్రదేశాలని మనం ఇప్పుడు శక్తిపీఠాలుగా పిలుస్తున్నాం అందులో పదవ శక్తిపీఠమే పిఠాపురం పురుహూతికాదేవి అమ్మవారి శక్తిపీఠం 

ఇలా అమ్మవారి శరీరభాగాలు 18 చోట్ల పడ్డాయి వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలు అంటున్నాం మీరు ఆపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయ్ వాటికీ పేర్లు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే క్రింద ఇచ్చిన అష్టాదశ శక్తీపీఠాలు అనే దాని మీద క్లిక్ చేసి చదవండి 


ఇంకా ఈపురుహూతికా అమ్మవారి  విషయానికి వస్తే అమ్మవారి పీట భాగం ఇక్కడ పడటంవలన ఈ పట్టణానికి పిఠాపురం అనే పేరు వచ్చింది ఇంత పురాణం ప్రశిష్ట్యం  ఉన్నప్పటికి ఒక అయిదువందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పటివరకు అమ్మవారి విగ్రహం విదేశీదండయాత్రల వలన కావచ్చు లేక మనవాళ్లే ఈ విగ్రహం ఇతర మతాలవాళ్ళకి దొరికితే వాళ్ళు ఈ విగ్రహాన్ని నాశనం చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశ్యం తో ఏదైనా బావిలో పడేసి ఉండవచ్చు కానీ మల్లి అమ్మవారి విగ్రహాన్ని  భూగర్భంలో నుంచి వెలికితీసి పునఃప్రతిష్ఠ చేశారు ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం చెక్కతో చేయబడి ఉంటుంది అలాగే ఆ విగ్రహం వెండికవచంతో కప్పబడి ఉంటుంది మీరు ఈ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే క్రింద ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళగలరు 






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)