అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి వాటి పూర్తి వివరాలు || the 18 shakti peetas full information in telugu
విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని కండించిన తరువాత అమ్మవారి శరీరభాగాలు పడినచోట్లనే అష్టాదశ శక్తిపీఠాలుగా చెబుతారు అసలు విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని కండించడం ఏమిటి అని మీకు అర్ధం కాకపోతే ఇంతకు ముందు ఈ విషయం మీద ఒక ఆర్టికల్ అష్టాదశ శక్తి పీఠాలు చదవండి
అష్టాదశ శక్తిపీఠాలు :
1.శ్రీలంకలో శాంకరీదేవి:
ఈ ఆలయం ఎక్కడ ఉంది అనే దానికి స్పష్టమైన అదారాలులేవు కానీ కొన్ని ఆధారాల ప్రకారం ఈ ఆలయం తూర్పుతీరంలో ట్రిన్కోమలీలో ఉన్నట్టు చెబుతారు. పోర్చుగీసువారి దండయాత్రలో ఆలయం ధ్వంసం అవటంవలన ఇప్పుడు ఆలయం ఉన్నచోట ఒక్కస్తంభం మాత్రమే ఉన్నట్టు చెబుతారు.
2.కాంచీపురంలో కామాక్షిదేవి:
ఈ అమ్మవారి ఆలయం తమిళనాడులో కాంచీపురంలో ఉంది ఇక్కడ అమ్మవారిని కామాక్షిదేవిగా పూజిస్తారు ఇక్కడ అమ్మవారి వీపుభాగం పడింది
3.ప్రద్యుమ్నానగరంలో శృంఖలాదేవి :
అమ్మవారి ఉదరభాగం పడిన చోటు కాబట్టి ప్రద్యుమ్నము అంటారు. ఇక్కడ అమ్మవారిని శృంఖలాదేవిగా పూజిస్తారు ఈ ప్రదేశం దాదాపు కోల్కత్తాకి 80 కిలోమీటర్ల ఉన్నట్టు చెబుతారు
4.క్రౌంచపట్టణంలో చాముండి దేవి :
చాముండి అమ్మవారి ఆలయం కర్ణాటక రాష్టంలోని మైసూర్ పట్టణంలో చాముండి పర్వతాల మీద ఆలయం ఉంటుంది ఇక్కడ అమ్మవారి కురులు పడినట్టు చెబుతారు
5.అలంపూర్ జోగులాంబ అమ్మవారు:
జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్లో ఉంది ఇక్కడ అమ్మవారి పైవరుస దంతాలు దవడ పడినట్టు చెబుతారు
6.శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు:
అమ్మవారి మెడభాగం పడినచోటే శ్రీశైలం ఇక్కడ అమ్మవారిని భ్రమరాంబికాదేవిగా కొలుస్తారు శ్రీశైలం దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది
7.కొల్హాపూర్ మహాలక్ష్మిదేవి:
ఈ కొల్హాపూర్ క్షేత్రం మహారాష్ట్రలో ఉంది ఇక్కడ అమ్మవారిని ఆదిపరాశక్తి అంబాబాయిగా కొలుస్తారు ఈక్షేత్రంలో అమ్మవారి నేత్రాలు పడ్డాయని చెబుతారు
8.మాహుర్యం ఏకవీరికా అమ్మవారు :
ఈ ఏకవీరికా క్షేత్రం మహారాష్ట్రలో నాందేడ్ సమీపంలో మహుర్యంలో వెలిసింది ఈ క్షేత్రంలో అమ్మవారి కుడిచేయి పడి ఏకవీరికాదేవిగా అమ్మవారు పూజలందుకుంటుంది
9.ఉజ్జయిని మహంకాళి :
మద్యప్రదేశ్లో ఈ ఉజ్జయిని క్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో అమ్మవారి పైపెదవి పడింది ఇక్కడ అమ్మవారిని మహాంకాళీగా పూజిస్తారు
10.పిఠాపురం పురుహూతికా అమ్మవారు :
ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం అనే గ్రామంలో ఈ పురుహూతికా అమ్మవారు వెలిశారు ఈ క్షేత్రంలో అమ్మవారి పీటభాగం పడటం వలన అమ్మవారు పురుహూతికా దేవిగా భక్తులకు దర్శనమిస్తారు
11.ఒడిస్సా గిరిజాదేవి:
ఈ క్షేత్రంలో అమ్మవారు గిరిజాదేవిగా పూజలందుకుంటున్నారు ఈక్షేత్రం ఓడిశాలోని జాజిపూర్లో ఉంది అయితే ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని చెబుతారు
12.ద్రాక్షారామం మాణిక్యాంబ :
ద్రాక్షారామం క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ క్షేత్రంలో అమ్మవారిని మాణిక్యాంబగా కొలుస్తారు ఇక్కడ అమ్మవారి ఎడమచెంప పడిందని చెబుతారు. ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాలలో ఒక్కటి కావడం విశేశం
13.గౌహతి కామరూప అమ్మవారు :
అస్సాం రాజధాని గౌహతిలో అమ్మవారి యోనిభాగం పడిందని ప్రతీతిఇక్కడ ఉన్న నీలాచల పర్వతశిఖరాలపై అమ్మవారు వెలిశారు కాబట్టి అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారు
14.ప్రయాగ మాధవేశ్వరి:
ప్రయాగ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారి కుడిచేతి వ్రేళ్ళు పడినట్టు చెబుతారు ఇక్కడ అయితే ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కులు సమానంగా కట్టిన ఒక పీట మాత్రం ఉంటుంది
15.జ్వాలక్షేత్రం వైష్ణవి అమ్మవారు:
ఈ ఆలయంలో విగ్రహం ఉండదు అయితే నిరంతరం ఏడూ జ్వాలలు వెలుగుతూఉంటాయి. ఈ పుణ్యక్షేత్రం హిమాచల్ప్రదేశ్ లో ఉంది ఇక్కడ అమ్మవారి నాలుక భాగం పడిందని చెబుతారు
16.గయలో మంగళగౌరి:
ఈ క్షేత్రంలోని భక్తులు అమ్మవారిని మాంగళ్య గౌరిగా పూజిస్తారు బీహార్ రాష్ట్రంలోని గయా ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది ఇక్కడ అమ్మవారి స్థనాలు పడినట్టు చెబుతారు
17.వారణాసిలో విశాలాక్షి:
వారణాసిలో అమ్మవారి చెవిబాగం పడినట్టు స్థలపురాణం చెబుతుంది
18.జమ్మూకాశ్మీర్ సరస్వతి :
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ ఆలయం ఉంది ఇక్కడ అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు
18 shakti peethas list in telugu
kamaakya temple
puruhuthikatemple pthapuram