jonnawada kamakshi temple history in telugu|| జొన్నలవాడ కామాక్షి మాత దేవాలయం :
jonnawada kamakshi temple history in telugu|| జొన్నలవాడ కామాక్షి మాత దేవాలయం :
ఆలయ ప్రాశస్తయం (temple history) in jonnawada kamakshi temple history in telugu :
ఈ ఆలయం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది ఇక్కడ ఆలయానికి పురాణా ప్రాసిస్త్యంతో పాటు చారిత్రక ప్రాసిస్త్యం కూడా ఉంది. శంకరాచార్య మహాస్వామి హిమాలయాలకు వెళుతూ ఈ ప్రదేశాన్ని దర్శించునుకున్నారు.
ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే పురాణాకాలంలో కశ్యప ప్రజాపతి తాను యజ్ఞం చేయటం కోసం ఒక మంచి అనువైన ప్రదేశము కోసం భారతయాత్ర నిర్వహించి వెదుకుతూ ఉండగా పవిత్రమైన పెన్నానదికి ఉత్తర దిక్కున రాజతగిరి ప్రాంతాన్ని ఆపవిత్ర యజ్ఞానికి అనువైనదిగా బావనచేసి ఈచోటుని ఎంచుకున్నాడు అల ఇక్కడ దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, ఆరస్పత్యాగ్ని అనే మూడు యజ్ఞకుండలని ఏర్పాటు చేసారు కశ్యపప్రజాపతి కశ్యపుని యజ్ఞయాగానికి పరవశించి పరమశివుడు యజ్ఞకుండం నుంచి స్వయంగా ఉద్బవించాడు అని స్కందపురాణంలో ఉంది. అప్పటి యజ్ఞవాటికయైన జన్నాడా ప్రస్తుతం జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది.
ఆల పరమశివుడు యజ్ఞకుండంలో ఉద్బవించిన తరువాత అయ్యవారు కైలాసంలో కనిపించకపోయే సరికి అమ్మవారు ఆందోళనకు గురై జొన్నవాడకు చేరుకున్నారు. అమ్మవారు అయ్యవారిని కలుసుకున్నాక ఆపరమశివుడు అమ్మవారిని తనతో ఉండమని కోరగా అప్పుడు పార్వతిమాత ఒక నీటి బిందువురూపంలో శిలగా అక్కడే అయ్యవారితోపాటు కొలువైయున్నారు. తరువాతి కాలంలో జాలరులు వలలో చిక్కిన అమ్మవారి శిలావిగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్టించారు. నాలుగో శతాబ్దంలో హిమాలయాలకు కైలాసయాత్ర చేస్తున్న ఆదిశంకరాచార్యస్వామి పెన్నానదిలో పూజలందుకుంటున్న అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరీదేవి అమ్మవారి అంశగా గుర్తించి ఆలయంలో ప్రతిష్టాపన చేసారు. అప్పటినుంచి ఇక్కడ అమ్మవారిని కామాక్షితాయిగాను పరమైవుడిని మల్లికార్జునిడిగాను భక్తులు పూజించుకుంటున్నారు వ్యాసమహర్షి రాసిన అష్టాదశ పురాణాలలో ఒక్కటైనా స్కాందపురాణం కామాక్షి విలాసంలో ఈవిషయం చెప్పబడి ఉంది.
పినాకిని తీర్థం in jonnawada kamakshi temple history in telugu :
జొన్నవాడలో విత్రపినాకిని అనే ఒక తీర్థం ఈ తీర్థానికి చాల ప్రాముఖ్యత ఉంది. ఈ నదిలో స్త్నానమాచరించడం వలన మనకున్న సర్వపాపాలు తొలిగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ద్వాపరయుగంలో దేవతలకు అధిపతి అయినా దేవేంద్రుడు వృస్యపర్వుడు అనే రాక్షసుడి ద్వారా బాధింపబడి తన పదవిని కోల్పోయి జొన్నవాడకి చేరి ఇక్కడ పెన్నానదిలో స్త్నానమాచరించి కామాక్షితాయిని అమ్మవారిని పూజించడంతో తిరిగి తన పదవిని సంపాదించుకున్నాడు అలాగే ఆరాక్షషుల బాధల నుంచి కూడా విముక్తుడయ్యాడు.
త్రేతాయుగంలో కుష్టువ్యాధి గ్రస్థుడైన అశ్వద్ధామ ఇక్కడ పినాకిని నదిలో స్థానం చేసి వ్యాధి నుంచి ఉపశమనం పొందినట్టుగా పురాణాలూ చెబుతున్నాయి కవిబ్రహ్మ తిక్కన సోమయాజి భారత గ్రందాన్ని తెలుగులోనికి అనువదించడం ఇక్కడ నుంచే ప్రారంబించినట్టు చెబుతారు. ఇంత పురాతన ప్రసిస్త్యం ఉన్న జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురి అయ్యి 5శతాబ్దాలు పూజలకు నోచుకోకుండా ఉండిపోయింది. అల కొన్నిరోజుల తర్వాత 13వ శతాబ్దంలో మనుమసిద్ధి మహారాజు ఈ ఆలయాన్ని పునఃస్థాపితం చేసినట్లు కొన్ని తాళపత్ర గ్రంధాల ద్వారా తెలుస్తున్నది. అప్పటి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అమ్మవారికీ 1969 ఏప్రిల్ నెలలో మహాకుంభాభిషేఖం నిర్వహించారు. ఇక్కడ పూజలు ఉత్సవాలు శైవాగమ సంప్రదాయంలో జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు 9రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.
సమస్యలతో బాధపడుతున్నవారు ఇక్కడ పవిత్ర పినాకిని నదిలో స్థానం చెస్తే కష్టాలు తీరి సుఖశాంతులు కలుగుతాయి. అలాగే ఆలయం నిద్రిస్తే అమ్మవారు వాళ్ళకి కలలో కనిపించి వాళ్ళ కోరికలు తీరుస్తారంట.
దూర్వాసమహాముని శాపం పెట్టడం వలన ఇంత ప్రాచీనమైన దేవాలయం నది పొంగిపోయి కొన్ని వందల సంవత్సరాలపాటు నీటిలో మునిగిపోయింది. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తరువాత ఒక పశువుల కాపరికి ఒక దివ్యమైన కాంతితో శివలింగం కనిపించింది అప్పుడు ఆ శివాలన్గాన్ని అక్కడ ప్రతిష్టించారు మళ్ళీకొంతకాలానికి బెస్తవారు చేపలకోసం నదిలో వాలా విసిరినపుడు ఆ వలలో అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చింది అప్పుడు బెస్తవారు శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహం ఉంచి మాంసాహారాన్ని నైవేద్యం పెట్టి పూజలు చేసేవారు రాత్రి సమయాల్లో అమ్మవారి భీకర శాబ్దాలకు బెస్తవాళ్ళు భయపడేవారు. ఆదిశంకరాచార్యస్వామి వారు అక్కడికి వచ్చినపుడు మాంసాహారాన్ని నిషేధించి వైదికసంప్రదాయంలో పూజలు జరిపారు స్వామిజి అప్పటినించి అక్కడ అమ్మవారు శాంతస్వభావరాలుగా భక్తులను కాపాడుకుంటూ వస్తుంది.
ధ్వజప్రసాదం in jonnawada kamakshi temple history in telugu :
ఇక్కడ పూజారులు ధ్వజస్థంభానికి అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు ఈ ప్రసాదాన్ని ఆరగించినవారికి ఆరోగ్యం అలాగే సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. ఈ ప్రసాదాన్ని దక్కించుకోవడం కోసం భక్తులు దేశంలోని చాల రాష్ట్రాల నుంచి తరలివస్తారు.
గిన్నె ఉత్సవం in jonnawada kamakshi temple history in telugu :
పరమేశ్వరుడు భవతీభిక్షందేహి అని బిక్షాటన చేసినందుకు గుర్తుగా ఇక్కడ గిన్నెబిక్ష ఉత్సవాన్ని చేస్తారు.
ఇతర ఉత్సవాలు in jonnawada kamakshi temple history in telugu :
అలాగే రథోత్సవం, స్వామివారు అమ్మవార్లను గజసింహవాహనంపై ఊరేగింపు, స్వామి అమ్మవార్ల కళ్యాణమహోత్సవం అలాగే స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా ఉంచి ఎదురుకోల మహోత్సవం జరిపిస్తారు